గూగుల్ క్రోమ్ క‌స్ట‌మైజేష‌న్ ట్రిక్స్  పార్ట్ 2-  బ్యాక్‌గ్రౌండ్‌గా మీకు న‌చ్చిన క‌ల‌ర్‌, ఫోటో

డెస్క్‌టాప్ మీద మీకు న‌చ్చిన ఫోటోను వాల్‌పేప‌ర్‌గా పెట్టుకుంటారు. అది బోర్ కొడితే ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటారు. కానీ క్రోమ్‌లో మాత్రం అదే రొటీన్ లుక్‌. ఆగండాగండి.. మీకు న‌చ్చిన ఫోటోను మీ క్రోమ్ బ్రౌజ‌ర్ హోం పేజీగా కూడా పెట్టుకునే ఆప్ష‌న్ ఉంది.  అంతేకాదు కావాల్సిన రంగు లేదా ప్యాట్ర‌న్ థీమ్ కూడా పెట్టుకోవ‌చ్చు.
ఇదిగో ఇలా.. 
1. మీ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో ఒక కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేయండి.

2.  హోంపేజీ కింద భాగంలో క‌స్ట‌మైజ్ అని ఒక ఐకాన్ క‌నిపిస్తుంది.

3. దాన్ని క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో ర‌క‌ర‌కాల బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి అప్‌లోడ్ చేస్తే మీ బ్రౌజ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ క‌ల‌ర్ మారిపోతుంది.

4. బ్యాక్‌గ్రౌండ్స్‌లో మొదటి ఆప్ష‌న్‌గా ఒక ప్ల‌స్ గుర్తుతో కూడిన ఖాళీ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ పీసీ లేదా మ్యాక్‌లో ఉన్న ఏ ఫొటోనైనా మీ బ్రౌజ‌ర్ బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవ‌చ్చు.

డిఫాల్ట్ ఇమేజ్ కావాలంటే
మీరు మ‌ళ్లీ మీ బ్రౌజ‌ర్ పాత లుక్కే కావాల‌నుకుంటే దాన్ని మార్చుకోవ‌చ్చు. 

1. క్రోమ్ బ్రౌజ‌ర్‌లోకి వెళ్లి త్రీడాట్స్‌తో ఉన్న మెనూ ఐకాన్‌ను క్లిక్ చేయండి.

2. కిందికి స్క్రోల్ చేసి సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేయండి. 

3. సెట్టింగ్స్‌ పేజీలో కిందికి వెళితే అడ్వాన్స్డ్  అనే లింక్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.

4.వ‌చ్చే పేజీలో కిందికి స్క్రోల్ చేసుకుంటే వెళితే Reset బ‌ట‌న్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ క్రోమ్ బ్రౌజ‌ర్ డీఫాల్ట్ లుక్ తిరిగి వచ్చేస్తుంది.   
 

google chrome customization tricks google Chrome Customization chrome background imags గూగుల్ క్రోమ్ క‌స్ట‌మైజేష‌న్‌ గూగుల్ క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్ Â